అడ్డంగా దొరికిన బీహార్‌ మంత్రి

బీహార్ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు ముందు జేడీయూకు పెద్ద షాక్ తగిలింది. నితీశ్‌కుమార్ క్యాబినెట్‌లోని మంత్రి అవదేశ్ ప్రసాద్ కుష్వాహా లంచం తీసుకుంటూ స్టింగ్ ఆపరేషన్‌కు చిక్కిన వీడియో బహిర్గతమైంది. దీంతో వెంటనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని జేడీయూ జాతీయ అధ్యక్షుడు శరద్‌యాదవ్ ధ్రువీకరించారు.  ఎన్నికల్లో కుష్వాహా నామినేషన్ వేసిన నియోజకవర్గంలో ఆయన స్థానంలో నామినీగా ఉన్న వ్యక్తిని తమ పార్టీ అభ్యర్థిగా పరిగణిస్తామన్నారు. కుష్వాహాపై ఆరోపణలను విశ్వసించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీజేపీలా ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడినా చర్య తీసుకోకుండా ఉండలేదన్నారు. ఓ కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరించేందుకుగాను కుష్వాహా రూ.4 లక్షల లంచం తీసుకుంటున్నట్టుగా వీడియోలో రికార్డయింది. అయితే తనపై పెద్ద కుట్ర జరిగిందని ఆయన ఆరోపిం