అతిథి ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు
ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి):
ఖమ్మం జిల్లాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో విద్యా సంవత్సరానికి సంబంధించి అతిథి (గెస్ట్) ఉపాధ్యాయుల నియామకం చేపడుతున్నట్లు గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ తాతారావు తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలన్నారు. పిఇటి విభాగంలో గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రంలకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. టిజిటి విభాగంలో తెలుగు, గణితం, ఆంగ్లం, సైన్స్ సబ్జెక్టులకు ఉపాధ్యాయులు కావాలన్నారు. పిఇటి విభాగంలో పిజితో పాటు బిఇడి విద్యార్హతగా ఉందన్నారు. టిజిటిలో డిగ్రీతో పాటు బిఇడి విద్యార్హతగా ఉందన్నారు. ఈ నెల 9వ తేదీలోగా దరఖాస్తులు ఆయన చేసుకోవాలన్నారు.