అత్తను చంపిన అల్లుడికి జీవితఖైదు, జరిమాన

మహబూబ్‌నగర్‌ (న్యాయవిభాగం),

కోస్లి మండలం పొతిరెడ్డిపల్లి గ్రామంలో ఏడాది క్రితం అత్తను చంపినఅల్లుడు మోట్కరి రాములు జీవిత ఖైదు, రూ. 15వేలు జరిమాన విధిస్తూనాలుగవ అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ఎన్‌. భజరంగబాబు శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం పొతిరెడ్డిపల్లికి చెందిన ఈర్లపల్లి నర్సయ్య చేసిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అక్కంపల్లికి చెందిన తన అల్లుడు భార్యను తల్లిగారి ఇంట వదిలేందుకు పోతిరెడ్డిపల్లికి  వచ్చాడు 21.01. 2012న  రాత్రి అత్త సావిత్రమ్మను గొంతునమిలి చంపేసి ఆమె ఒంటిమీద ఉన్న 3 తులాల బంగారం. 5 తులాల వెండి నగాలను అపహరించాడు. ఫిర్యాదపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా సంఘటనకు అల్లుడే కారణమాని పరిశోధనలో తెలిందని అప్పటీ సీఐ రామరావు ఛార్జీషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులు అదనపు పీపీ ఆర్‌. విఠల్‌ ప్రాసిక్యూషన్‌ను నిర్వహించారు.