అత్యంత శక్తివంతుడుగా ఒబామా
న్యూయార్: ఫోర్బ్స్ జాబితాలో అత్యంత శక్తివంతుడుగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిలిచారు. ప్రపంచ జనాభా 710 కోట్లకు చేరిన నేపథ్యంలో అందులోనుంచి 71 మంది అత్యంత శక్తివంతులైనవారిని ఫోర్బ్స్ ఎంపిక చేసింది. ఆ జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో బరాక్ ఒబామా మొదటి స్థానంలో ఉన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు అధిపతిగా ఉండటం వల్ల ఒబామాకు ఈ భూమ్మీద అందరి కంటే ఎక్కువ శక్తి వచ్చిందని ఫోర్బ్స్ వివరించింది.
రెండో స్థానంలో జర్మనీ ఛాన్సెలర్ ఏంజిలా మెర్కెల్ ఉంది. యూరో జోన్ విచ్ఛిన్నం కాకుండా చూడటంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో మెర్కెల్ నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి వచ్చారు. మూడో స్థానం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు. నాలుగో స్థానంలో మైక్రో స్టాప్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఉన్నారు.
మన దేశం నుంచి సోనియా గాంధీ 12వ స్థానంలో నిలిచారు. ప్రధాని మన్మోహన్ 19వ స్థానంలో ఉన్నారు. 37వ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో ముకేశ్ అంబానీ, 47వ స్థానంలో ఆర్సెలర్ మిట్టల్ సీఈవో లక్ష్మీనివాస్ మిట్టల్ ఉన్నారు. దాయాది దేశానికి చెందిన ఆర్మీ చీఫ్ అష్ఫాక్ పర్వేజ్ కయానీ 28వ స్థానంలో ఉండటం గమనించాల్సిన విషయం.