-అత్యవసర పరిస్థితి ఉందని పోతే పట్టించుకునే నాధుడే కరువు
పట్టించుకోని అధికార యంత్రాంగం
-చరవాణి తో కాలక్షేపం
చేస్తున్న నర్సులు, ఫార్మసిస్ట్.
-ఎవరైనా ఏంటిది అని ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం.
ములుగు
బ్యూరో జులై 22(జనంసాక్షి):-
జిల్లా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ అని వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.కొంతమంది జిల్లా కేంద్రంలోని వంద పడకల హాస్పత్రి 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి అని చుట్టుప్రక్కల మారుమూల గ్రామాల ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ లో డబ్బులు పెట్టే అంత స్థోమత లేక గిరిజనులు మరియు పెద్ద వారు సైతం అత్యవసర సమయాల్లో వైద్యం కోసం జిల్లా ఆస్పత్రి లో కొంతమంది ప్రజలు కట్టే పన్నుల ద్వారా గవర్నమెంట్ జీతాలు వస్తున్నాయని తెలిసి కూడా నెలకు నా జీవితం నాకు వస్తుంది లే అనే ధీమాతో వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వారి పై దురుసుగా ప్రవర్తిస్తూ వచ్చిన పేషెంట్లను వెయిటింగ్ లో నిల్చోబెట్టి ఓ పి ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళమని చెప్తూ ఉంటే ఉండు లేకపోతే లేదని దబాయిస్తూ కాలయాపన చేస్తున్నారని అత్యవసర పరిస్థితుల్లో చికిత్సకు వచ్చిన సదరు వ్యక్తి వాపోతున్నాడు పోనీ డాక్టర్ చూసినా కూడా కనీసం మందులు ఇవ్వడానికి ఉన్నా ఫార్మసిస్ట్ వెయిటింగ్ లో నిల్చోబెట్టి ఫోన్ లో కాలయాపన చేస్తున్నారు అని బాధితులు చెబుతున్నారు.నేనే రాజు నేనే మంత్రి అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు నేను డ్యూటీ చేసినా చేయకపోయినా మా డబ్బులు మాకు వస్తాయి నెలనెల అంటూ పేషెంట్లపై దురుసుగా ప్రవర్తిస్తునారు ఇదిలా ఉండగా ఉన్నత అధికారులు మాత్రం ఎల్లవేళలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని డబ్బా కొడుతున్నారని అంటున్నారు కావున అధికార యంత్రాంగం పట్టించుకోని ఎవరి డ్యూటీ వాళ్ళు బాధ్యతారహితంగా చేసే విధంగా పేషెంట్ ల పట్ల ప్రేమపూర్వకంగా వ్యవహరించాలి తప్ప దురుసుగా ప్రవర్తించ కూడదని ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు.
|