అత్యాచారానికి పాల్పడేవారిని ఉరి తీయాలి : సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారానికి పాల్పడేవారిని ఉరితీయాలని భాజపా నేత సుష్మాస్వరాజ్ అన్నారు. వైద్య విద్యార్థినిపై ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై లోక్‌సభలో సుష్మాస్వరాజ్ మాట్లాడారు. సామూహిక అత్యాచార ఘటనలు జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. దక్షిణ ఢిల్లీలో జరిగిన ఈ అత్యాచార ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారో కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ వ్యక్తం చేశారు.