అత్యాచారాల్లో ముందువరుసలో యూపీ

– తరువాతి స్థానంలో మధ్య ప్రదేశ్‌

– గణాంకాలు విడుదలచేసిన జాతీయ కైం రికార్డ్స్‌ బ్యూరో

న్యూఢిల్లీ, నవంబర్‌30(జ‌నంసాక్షి): హత్య, అత్యాచారం వంటి తీవ్ర నేరాల విషయంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ దేశంలోనే ముందువరసలో ఉంది. జాతీయ కైమ్ర్‌ రికార్డ్స్‌ బ్యూరో విడుదల చేసిన గణాంకాలు యూపీలో నేరాల తీవ్రతకు అద్దం పట్టాయి. గత ఏడాది యూపీలో దేశంలోనే అత్యధికంగా 4,889 హత్యలు చోటు చేసుకోగా, మహిళలపై నేరాల సంఖ్య 7500కుపైగా నమోదయ్యాయి. బీహార్‌లో గత ఏడాది 2,581 హత్యలు జరిగాయి. మహిళలపై అత్యాచారాలు యూపీ తర్వాత అధికంగా మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకోవడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో 4882 అత్యాచార కేసులు నమోదవగా.యూపీలో 4,816 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇక 2015లో దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాల కేసులు 34,651 కేసుల నుంచి 2016లో 12.4 శాతం పెరిగి 38,497 కేసులకు పెరిగాయి.మహారాష్ట్రలో మహిళలపై అత్యాచార ఘటనలు 4,189గా నమోదయ్యాయి. 2016లో వివిధ నేరారోపణలపై 37,37,870 మంది నిందితులు అరెస్ట్‌ అయ్యారు. వీరిలో 32,71,262 మందిపై చార్జిషీట్‌ నమోదై, 7,94,616 మంది దోషులుగా నిర్ధారణ అయినట్టు కైమ్ర్‌ బ్యూరో రికార్డులు వెల్లడించాయి.