అత్యాచార ఘటనపై హోంమంత్రి, ఢిల్లీ సీఎంలకు సోనియా లేఖ
న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌లకు లేఖ రాశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. మహిళల రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని సోనియా పరామర్శించారు. ఆమె ఆరోగ్య స్థితిగతుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.