అదనపు ఎస్పీగా తఫ్సీర్ ఇక్బాల్ బాధ్యతలు
ఖమ్మం నేరవిభాగం: జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా తప్సీర్ ఇక్బాల్ బాధ్యతలు స్వీకరించారు. వైజాగ్ రూరల్ నర్సీ పట్నం ఓఎస్టీగా పనిచేస్తూ బదిలీపై ఆయన ఇక్కడకు వచ్చారు. ట్రైనీ ఐపీఎన్‌గా ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో శిక్షణ పొందిన అనుభవం ఉంది. ఖమ్మం అదనపు ఎస్పీ ప్రకాశ్ యాదవ్‌కు కాకినాడ ఓఎస్టీగా బదిలీ అయింది.