అదరకొట్టిన కోహ్లీ..!!
తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు శుభారంభం లభించలేదు. జట్టు స్కోరు 22 పరుగులకే మురళీ విజయ్, లోకేశ్ రాహుల్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన విరాట్‌కోహ్లీ (151 నాటౌట్) పుజారాతో కలిసి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. వీరిద్దరూ 371 బంతుల్లో 226 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు భారీ స్కోరుకు పునాది వేశారు. కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతోన్న కోహ్లీ 14వ శతకం చేశాడు. కెప్టెన్‌గా సచిన్ 7 సెంచరీల రికార్డు సమం చేశాడు. అజారుద్దీన్ (9), గావస్కర్ (11) ముందున్నారు. కోహ్లీకిది నాలుగో 150+ స్కోరు కావడం విశేషం.