అదరిపోయేలా నిజామాబాద్ సభ
మలి సభ ఏర్పాట్లపై మంత్రి ఈటెల పరిశీలన
9సీట్లూ గెలిచి కెసిఆర్‌కు కానుకగా ఇద్దామన్న ఈటెల
ఎంపి కవితతో కలసి పర్యవేక్షణ
నిజామాబాద్,సెప్టెంబర్29(జనంసాక్షి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మళ్లీ టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈటల రాజేందర్, ఎంపీ కవిత విూడియాతో మాట్లాడారు.
నిజామాబాద్‌లో 3న సిఎం కెసిఆర్ ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. స్థానిక నేతలతో కలసి చర్చించారు. భారీగా ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రజలను భారీగా రప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు గుండెల విూద చేయి వేసుకొని ఆలోచించుకోవాలి. కాంగ్రెస్‌కు ఓటేస్తే అదే దోపిడీ పాలన.. ప్రజలు ఇబ్బందులు పడుతారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురవేయాలని చెప్పారు. వచ్చే వర్షాకాలం నుంచి నిజామాబాద్ శాశ్వతంగా కరువుకు దూరం అవుతుందన్నారు. ఎరువుల కోసం లైన్లలో నిలబడిన రోజులు పోయాయి. పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రైతులకు రూ. 5 లక్షల చొప్పున బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఈటల గుర్తు చేశారు. రైతు కంట కన్నీరు పెడితే రాజ్యం బాగుపడిన సందర్భాలు లేవు..రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది.. రైతును రాజుగా చేస్తున్నాం. రైతు రాజ్యం స్థాపించడమే ధ్యేయం..ఆకుపచ్చని తెలంగాణెళి లక్ష్యంగా కెసిఆర్ ముందుకు సాగుతున్నారని ఈటెల అన్నారు. అందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల కోసం పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి గింజనూ మద్దతు ధరలతో కొనుగోలు చేస్తామనీ, దళారులకు అమ్ముకోవద్దని హితవు పలికారు. రైతుబంధు, బీమా, ఎకరానికి రూ.8వేల పెట్టుబడి సాయం, 24గంట కరెంట్‌ను దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని, దేశ చరిత్రలో నిలిచిపోయే పథకాలు అమలు చేస్తున్నామన్నా రు. రైతులకే కాకుండా పేద కుటుంబాల్లో కుటుం బ పెద్ద మరణిస్తే ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వారిని ఆదుకునేందుకు బీమా పథకం అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. రూ.వెయ్యి కోట్లతో ఎస్సారెస్పీ కాలువలను ఆధునికీకరణ చేపించామని, చివరి ఎకరాకు నీరందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. వచ్చే ఏడాది కల్లా ప్రాజెక్టులు పూర్తి చేస్తామనీ, 360 రోజులు పంటలకు నీటి కొరత లేకుండా ఉంటుందని పేర్కొన్నారు. మట్టిలో బంగారం పండించే ప్రణాళికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయనీ, బంగారు తెలంగాణ కల సాకారం కొద్ది దూరంలోనే ఉందన్నారు.ప్రజల మద్దతంతా ప్రభుత్వానికే ఉందని పేర్కొన్నారు.