అదుపులోకి తీసుకున్న యువకుల విచారణ
హైదరాబాద్,ఆగస్ట్7(జనంసాక్షి): హైదరాబాద్‌లో సోమవారం అదుపులోకి తీసుకున్న ఆరుగురిని ఎన్‌ఐఏ విచారిస్తున్నది. పాతబస్తికి చెందిన యువకులు బాసిత్, సన, ఫరూకీ, ఖాదర్, ఖలీద్ అహ్మద్, ఖాజా, మహమ్మద్ అబ్దుల్ ఖదీర్, తండ్రి అబ్దుల్ ఖుద్దూస్‌లు విచారణకు హాజరయ్యారు. వీరిని విచారిస్తున్న ఎన్‌ఐఏ.. నిన్న షహీన్‌నగర్‌లోని అబ్దుల్ ఖాదర్ ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు జరిపి లాప్‌టాప్‌తో పాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 2016లో ఐసిస్ సానుభూతిపరులకు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసింది. అప్పుడు వదిలేసినవారిలో కొందరు ఐసిస్ వైపు మొగ్గుచూపుతున్నట్టు ఎన్‌ఐఏకు ఆధారాలు లభించాయి. దీంతో మరోమారు వారి కదలికపై దృష్టిపెట్టిన ఎన్‌ఐఎ వారిని అదుపుతోకి తీసుకుంది.