అద్దె ట్యాంకర్లతో ఆడుకున్నారు

బాగా వెనకేసుకున్నారని ప్రచారం?
అనంతపురం,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : తాగునీటి సరఫరా మున్సిపల్‌ అధికారులకు కాసుల పంట కురిపిస్తోంది. దీంతో కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో లక్షలాది రూపాయల ప్రజాధనం నీటి పాలవుతోంది. టెండర్ల పక్రియకు ఎగనామం పెట్టి అనధికారికంగా అ/-దదె ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తూ అధికారులు జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు గుప్పుమన్నాయి. గత ఐదేళ్లుగా ఇదేతంతు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎండాకాంలో మొత్తం ఇదే దందా సాగిందన్న ప్రచారం బహిరంగమే.  అద్దె ట్యాంకర్లతో నీటి సరఫరా, మోటార్లు, స్టార్టర్ల మరమ్మతులకు సంబంధించి ఇష్టారాజ్యంగా ఓచర్లు సృష్టించి రూ. లక్షల్లో కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో పట్టణంతో పాటు
గూబనపల్లి, దొడగట్ట, కురాకులతోట, ఒంటిమిద్ది, ముదిగల్లు గ్రామాలు ఉన్నాయి. ఇందులో సుమారు 55 వేల జనాభా ఉంది. సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం నీటితో పాటు 32 రక్షిత మంచినీటి బోరుబావులు ఉన్నాయి. భూర్భజలాలు అడుగంటడంతో అందులో సగం బోర్లు ఎండిపోయాయి. దీంతో మిట్ట ప్రాంతాలైన ఇందిరమ్మ కాలనీ, కోటవీధి, ధర్మవరం రోడ్డు, వ్డడె కాలనీ, దేవాదుల కొండ, తదితర గ్రామాల్లో నీటి సమస్య అధికంగా ఉంది. మొదట్లో మున్సిపల్‌ ట్యాంకర్‌తో నీటిని సరఫరాచేస్తూ వచ్చారు. జనాభాకు అనుగుణంగా తాగునీటిని సరఫరా చేయాలని గత ప్రభుత్వం ఆదేశించింది. ఇదే అదునుగా భావించిన అధికారులు రెండు అ/-దదె ట్యాంకర్లతో పుష్కలంగా నీటిని సరఫరా చేస్తున్నట్లు కాకిలెక్కలు సృష్టించి ఇంజనీరింగ్‌ సెక్షన్‌ అధికారులు ఎడాపెడ బిల్లులు కాజేస్తున్నారనే విమర్శలు గుప్పుమన్నాయి. వేసవిలో యుద్ధ ప్రాతిపదికన నీటి సరఫరా చేసినట్లు కౌన్సిల్‌ అజెండాలో పొందుపరిచి లక్షలు కొల్లగొట్టారని చర్చ సాగుతోంది. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అద్దె ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ తతంగం కొన్నేళ్లుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వేసవిలో నీటి ఎద్దడి నివారణకు రూ. 60 లక్షలు నిధులు మంజూరుకు నివేదిక పంపారు.  కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్న నెలసరి బిల్లులో 10 శాతం పర్సెంటేజీల పేరుతో అధికారులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ ప్రముఖ ప్రజాప్రతినిధికి అండదండగా ఉన్న నాయకుడు ఏకంగా రెండు నీటి ట్యాంకర్లను మున్సిపాలిటీకి అప్పగించినట్లు సమాచారం.