అద్భుతమైన పారిశ్రామిక విధానం.. అమోఘమైన ఫలితాలు

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,ఆగష్టు 17(జనంసాక్షి): మూడేళ్ల రాష్ట్ర ప్రభుత్వం అద్బుతమైన విధానాలను అమల్లోకి తెచ్చిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. అయితే మిగిలిన రెండేళ్లు పాలసీల్లో హావిూ ఇచ్చిన అంశాల అమలును మరింత వేగంవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయా శాఖల వారీగా పలు కార్యక్రమాలు, ప్రాజెక్టులను మంత్రి సవిూక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయన్నారు. ఈ మేరకు రాష్టాన్రికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులే ప్రాతిపాదికగా పనిచేయాలని అధికారులను అదేశించారు. ఇకపై ప్రతి మూడు నెలల్లో సాధించే శాఖాపరమైన మైలురాళ్లను ముందే తెలియజేయాలన్నారు. ఈ మైలురాళ్లను అందుకోలేని అధికారులపై ఠినంగా వ్యవహారించేందుకు వెనకడబోమని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. గత ఏడాది ఈజ్‌ అఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ తో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సారి అదే స్ధానాన్ని కొనసాగించేలా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఇక ఈ సమావేశంలో హైదరాబాద్‌ ఫార్మాసిటీ, మెడికల్‌ డివైజెస్‌ పార్కులపైన మంత్రి కేటీఆర్‌ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు పరిశ్రమల నుంచి వచ్చిన ఆసక్తి వ్యక్తికరణ మేరకు సూమారు 8500 వేల ఎకరాల ప్రాథమిక డిమాండ్‌ ఉందని అధికారులు తెలిపారు. త్వరలోనే పర్యావరణ అనుమతులపై పబ్లిక్‌ హియరింగ్‌ ఉన్న నేపథ్యంలో స్థానిక ప్రజలకు ఫార్మసిటీ ద్వారా కలిగే లాభాలు, ఉద్యోగాలు, పార్కు లో జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌ ఉన్నందున ఏలాంటి కాలుష్యం ఉండదని వివరించాలన్నారు. ఎరోస్పేస్‌ రంగంలో మరిన్ని పెట్టుబడులు తీసుకుని వచ్చేలా ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక కంపెనీలు నగరంలో ఉన్నాయని, వీటికి మరిన్ని అంతర్జాతీయ కంపెనీలను నగరానికి తీసుకుని రావాలన్నారు. తెలంగాణ ్గ/బైర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుతో కలిసి సమన్వయం చేసుకుంటున్నామని అధికారులు మంత్రికి తెలిపారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టుతో పాటే తెలంగాణ ్గ/బైర్‌ గ్రిడ్‌ కూడా పూర్తవుతుందన్నారు. టాస్క్‌ ద్వారా ఇప్పటిదాకా ప్రధానంగా ఇంజనీరింగ్‌ విద్యార్దులకు శిక్షణ ఇస్తున్నామని, త్వరలో ఈ శిక్షణ కార్యక్రమాలను హెల్త్‌ సెక్టార్‌, ఫార్మా, అటోమోటివ్స్‌ రంగాలకు శిక్షణ కార్యక్రమాలను విస్తృత పరుస్తున్నట్లు తెలిపారు. టాస్క్‌ కేంద్రాలను జిల్లాలకు విస్తరించేందుకు దశల వారీగా ప్రయత్నాలు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, కమిషనర్‌ నదీమ్‌ అహ్మద్‌, టీయస్‌ ఐఐసీ ఎండీ వెంకటనర్సింహ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల అధికారులు పాల్గొన్నారు.