అద్భుత నగరంగా యాదాద్రి

అధికారులతో సవిూక్షలో ఎస్‌కె జోషి

హైదరాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ (యాడా)పై అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కే జోషి సవిూక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. యాదగిరిగుట్టను ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించి నట్లు చెప్పారు. యాదగిరిగుట్టలో మోడల్‌ బస్‌ స్టేషన్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలి. కాలపరిమితి విధించుకొని బస్‌ స్టేషన్‌ పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద గుట్టలో 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని ఏప్రిల్‌ 15 నాటికి పూర్తి చేయాలన్నారు. యాదగిరిగుట్టలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచినీరు, రహదారుల విస్తరణ, గండి చెరువు అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలన్నారు. వేద పాఠశాల, శిల్పకళా, ఆర్కిటెక్చర్‌ సంస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్దేశిరచారు. ఇందులో యాడా వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌ రావు, ఇవో గీత తదితరులు పాల్గొన్నారు.