అధిక పోషకాలు ఉన్న ఆహారాలే తీసుకోవాలన్న సూపర్వైజర్.

  కరుణ.అధిక పోషకాలు ఉన్న ఆహారాలే తీసుకోవాలన్న సూపర్వైజర్.  కరుణ.
జనం సాక్షి, కూసుమంచి.మండల పరిధిలోని జుజ్జూల్రావుపేట.మార్చ్ 21 నుండి ఏప్రిల్ 3 వరకు అంగన్వాడిలలో జరుగుతున్న పోషణ పక్వాడ్  కార్యక్రమంలో  ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి సూపర్వైజర్ పుష్పవతి, మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా భోజనానికి ముందు తర్వాత సబ్బుతో గాని డెటాల్ తో గాని చేతుల శుభ్రపరచుకొవాలని అదేవిధంగా కిషోర బాలికలు మరియు మహిళలకు అధిక పోషక విలువలు కలిగిన మీలెట్స్ గురించి వివరిస్తూ సరైన పోషణ విలువలు కలిగినటువంటి రాగులు,సజ్జలు,జొన్నలు, కొర్రలు,సామెలు ఇలాంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని సమపాలలో తీసుకోవాలని వివరించారు  ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం, ఏఎన్ఎం , కరుణ, అంగన్వాడీ సూపర్వైజర్ ఎం పుష్పావతి, టీచర్లు మంగమ్మ ,నాగమణి, ఉమా, ఆయా మాధవి, కరుణ, ఇందిర, తల్లులు, గర్భిణీ లు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.