అధిక ఫీజులు వసూలు చేస్తున్న
పెద్దపల్లి, జూన్ 11 (జనంసాక్షి):
పట్టణంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వా హకులు అధిక ఫీజులు వసూలు చేస్తున్న అధికా రులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఎన్ ఎస్‌యూఐ జిల్లా ప్రధానకార్యదర్వి పెర్కశ్యామ్ ఐబి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో అన్నారు. జీ.వో1 ప్రకారం నర్సరీ నుండి 10 వతరగతి వరకు ఆయాపాఠశాలలో నిర్వాహ కులు ఏతరగతికి ఎంత ట్యూషన్ ఫీజును తీసుకుంటున్నారో నోటీసు బోర్డుపై పెట్టాలని ఫీజు వివరాలను బహిర్గత ప్రకటన ద్వారా తెలిపాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా ఫీజును నిర్ణయించే ముందు పేరెంట్స్ కమిటీ అనుమతి తప్పనిసరిగా ఉండలన్నారు. 100మంది విద్యార్థులలో 25మంది పేదవిద్యార్థులకు ఉచితంగా విద్యనందించాలని తెలిపారు. అయితే దీనిని ఇక్కడి విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా యాజమాన్యులే ఫీజును నిర్ణయించి బలవంతంగా వసూలు చేస్తున్నాయన్నారు. ఇది మానుకోవాలని హెచ్చరించారు. అదేవిధంగా టెక్నో, టాలెంట్,గ్లోబల్,కాన్స్‌ప్ట్ తదితర పేర్లతో పుట్టగొడుగుల్లా పాఠశాలలు వెలుస్తున్నాయని తెలిపారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకం కనుక వెంటనే తొలగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో శ్రీనివాస్, రాజేందర్, రాజేశ్, సంతోష్, శ్రావణ్, వసీం. తదితరులు పాల్గొన్నారు.