అధిక లోడ్‌తో నిలిచిన గూడ్స్ రైలు
ఖమ్మం: అధిక లోడ్ కారణంగా ఖమ్మం జిల్లా బోనకల్లు సమీపంలో గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో అదే లైన్‌లో వస్తోన్న గుంటురు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను మోటమర్రిలో అధికారులు నిలిపివేశారు. నిలిచిపోయిన గూడ్స్ రైలు కోసం మరో ఇంజిన్‌ను అధికారులు తెప్పిస్తున్నారు.