అధిష్టానానికి టీ-కాంగ్రెస్‌ ఎంపీల షాక్‌

న్యూఢీల్లి : డిసెంబర్‌ 4,(జనంసాక్షి):
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు పార్లమెంట్‌ సభ్యులు చివరి నిమిషంలో అధిష్టానానికి షాక్‌ ఇచ్చారు. మంగళవారం పార్లమెంట్‌లో ఎఫ్‌డిఐలపై చర్చ జరుగుతుంది. ఆ తర్వత ఓటింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో టీ-ఎంపీలను బుజ్జ గించేందుకు కేంద్రమంత్రులు కమల్‌నాథ్‌, సుశీల్‌కుమార్‌ షిండేలు రంగంలోకి దిగారు. మంగళవారం తమతో భేటి కావాలని టీ-ఎంపీలకు ఇదివరకే సూచించారు. అయితే అనూహ్యంగా లాస్ట్‌ మినెట్‌లో భేటికి వెళ్ళేందుకు నిరకరించారు. ఎంపీలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, సురేష్‌ షేట్కార్‌, మంత్రులు బలరాంనాయక్‌, సర్వే సత్యనారయణలు మాత్రమే భేటికి హజరయ్యారు. దీంతో భేటీి అసంప్తూరిగా ముగిసింది..కేవలం నలుగురే రావడంతో షిండే కూడా అందరూ వచ్చాకే కలుద్దామని చేప్పి వెళ్ళిపోయారు. కాగా ఎంపీలు ఒక్కసారిగా వ్యూహం మార్చుకోవాడానికి గల కారణం అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చేందుకేనని తెలుస్తొంది. ఎఫ్‌డిఐలపై చర్చ జరిగే సమయంలో ఓటింగ్‌ కోసం వెళ్లాలంటే తమకు తెలంగాణపై స్పష్టమైన హమీ రావల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. డిసెంబర్‌ 9లోగా ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదిష్టానం తాము వ్యూహత్మకంగా వ్వవహరిస్తున్నామని, ఇప్పుడు తాము ఏమి మాట్లాడేది ఏమి లేదని, తెలంగాణ విషయంలో పార్టీపై,కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు తాము చేస్తున్నామని, తమ వ్యూహమేంటో తర్వత చేబుతామంటున్నారు. వారు పెద్దపల్లి ఎంపీ వివేక్‌ ఇంట్లో భేటి తర్వత  ఎంపీలు ఈ  నిర్ణయం తీసుకున్నారు. కాగా మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో ఎఫ్‌డిఐలపై చర్చ జరుగనుంది. బుధవారం ఓటింగ్‌ నిర్వహిస్తారు. రాజ్యసభలోనూ ఇదే అంశంపై గురువారం చర్చ చేపట్టి శుక్రవారం ఓటింగ్‌ జరుపే అవకాశం ఉంది. అయితే ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌లో జరగనున్న ఓటింగ్‌లో పాల్గొనబోమని తెలంగాణ ఎంపీలు తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ జేఏసీ స్వాగతించింది. కేంద్ర మంత్రులు కమల్‌నాథ్‌, సుశీల్‌కుమార్‌ షిండేలు నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైన తెలంగాణ ఎంపీలను జేఏసీ చైర్మన్‌ కోదండరాం అభినందించారు. ఎంపీలు ఇదే నిర్ణయంపై కట్టుబడి ఉండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. కేంద్రం సీమాంధ్ర ఎంపీలకిచ్చిన ప్రాధాన్యతను తెలంగాణ ఎంపీలకు ఇవ్వకుండా అవమానపరుస్తోందన్నారు.