అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలన్నదే తెలంగాణ ఎంపీల ఆలోచన: వీహెచ్‌

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి, మంత్రులు అధిష్ఠానం అదేశాలను పాటిస్తారన్న నమ్మకం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. తెలంగాణ విషయంలో చివరి వరకు అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలన్నదే తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఆలోచన అని ఆయన చెప్పారు. జగన్‌ కేసుతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.