అధైర్యపడవద్దు .. మనోవేదనకు గురికావద్దు.

63వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏలు.
– ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చైర్మన్ కురువ రామచంద్ర.
ఊరుకొండ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి):
వీఆర్ఏ మిత్రులు ఎవ్వరు కూడా అధైర్య పడవద్దని, మనోవేదనకు గురి కావద్దని.. మన డిమాండ్లు సాధించే వరకు మనం సమ్మెను కొనసాగించాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చైర్మన్ కురువ రామచంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం
వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు 63వ రోజు నిరవధిక సమ్మె లో భాగంగా ఊరుకొండ మండల కేంద్రంలో నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ఇచ్చిన హామీలను.. వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని డిమాండ్ చేశారు. ఆదివారం 63వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా మండల వీఆర్ఏలు తహాసిల్దార్ కార్యాలయం ముందు నిరసనలు వ్యక్తం చేశారు. వీఆర్ఏల ఆశయ సాధనలో భాగంగా ఊరుకొండ మండల విఆర్ఏ లు తమ డిమాండ్లు నెరవేరేవరకు ఉద్యమాన్ని విరమింప బోమని తెలియజేశారు. ఊరుకొండ మండల కేంద్రంలో వీఆర్ఏ జేఏసి చైర్మన్ సత్తయ్య మాట్లాడుతూ.. వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మిడ్జిల్ మండల వీఅర్ఏ జేఏసీ ఛైర్మన్ పెట్టి శ్రీశైలం, ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ బీ. సత్తయ్య, కో చైర్మన్ బీ.రమేష్ , జెర్నల్ సెక్రటరీ శేఖర్, కన్వినర్ డీ.శ్రీలత, కో కన్వినర్ లు సుల్తాన్. జంగయ్య, దశరథం. యాదయ్య, యాదమ్మ, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.