అనధికార నిర్మాణాల తొలగింపు

 

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13(జనం సాక్షి)

 

జిల్లాల టాస్క్ ఫోర్స్ కమిటీ ల ఆదేశాల మేరకు

హనంకొండ , వరంగల్

ఎన్ ఫోర్స్ మెంట్ టీం ల ద్వారా జిడబ్ల్యూఎంసీ పరిధిలోని 6 అనధికార నిర్మాణాలను గురువారం తొలగించడం జరిగింది.

 

జిడబ్లుఎంసి పరిధిలోని

వరంగల్   ఎస్ ఆర్ ఆర్ తోట వద్ద అనధికారికంగా నిర్మించిన కాంపౌండ్ వాల్, ఒక గదిని,

కరీమాబాద్ దర్గా ఉరుస్ ఎదురుగా అనుమతి లేకుండా నిర్మించిన రెండవ అంతస్తు నిర్మాణాన్ని,

కరీమాబాద్ దర్గా ఉరుస్

వద్ద ఉన్న జి ప్లస్ 2 భవనం యొక్క అనధికారిక నిర్మాణాన్ని తొలగించారు.

 

అదేవిధంగా హన్మకొండలోని ప్రశాంత్ కాలనీ వడ్డేపల్లిలో ఉన్న జెకె టవర్స్ అపార్ట్‌మెంట్‌ వద్ద అనధికారికంగా పెంట్ హౌస్ నిర్మాణాన్ని, రెవెన్యూ కాలనీలో అనధికారికంగా నిర్మించిన

కాంపౌండ్ వాల్, సింగిల్ రూమ్ లను తొలగించారు.వంగపహాడ్ డివిజన్ నెం.2.బస్టాండ్ దగ్గర అనధికారికంగా నిర్మించిన కాంపౌండ్ వాల్,  షెడ్ లను కూల్చివేశారు.

 

నగర ప్రజలు  టీఎస్ బి పాస్ ద్వారా అనుమతి పొందిన తదుపరి మంజూరు చేసిన ప్లాన్  ప్రకారమే ఎలాంటి డివియేషన్ లేకుండా ఖచ్చితంగా భవనాలు నిర్మించుకోవాలని, లేనిచో  నిబంధనల ననుసరించి కఠిన చర్యలు తీసుకోని కూలగొట్టడం జరుగుతుందని బల్దియా డిప్యూటి సిటీ ప్లానర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు.

 

రెవిన్యూ, పోలీస్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ మరియు బల్దియా అధికారులు, సిబ్బంది తదితరులు ఈ  డెమొలిషన్ లో పాల్గొన్నారు.