అనారోగ్యంతో అంగన్వాడి ఆయా మృతి

-ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఆయ కుటుంబానికి 20 వేల ఆర్థిక సాయం

కురవి అక్టోబర్-20 (జనవరి సాక్షి న్యూస్)

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామంలోని అంగన్వాడీ-1 కేంద్రం లో విధులు నిర్వహిస్తున్న పెండం నరసమ్మ(80) అస్వస్థతకు గురి కావడంతో చికిత్స కోసం మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.వారి పార్థివ దేహాన్ని పూలమాలవేసి ఘన నివాళులర్పించిన డోర్నకల్ ప్రాజెక్ట్ ఐసిడిఎస్ సిడిపిఓ ఎల్లమ్మ, స్థానిక సర్పంచ్ ముండ్ల ప్రమీల రమేష్. అంగన్వాడి ఆయా నరసమ్మ చనిపోవడం ఐసిడిఎస్,వారి కుటుంబానికి తీరనిలోటని వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చారు.ఐసిడిఎస్ డోర్నకల్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఎల్లమ్మ ఆధ్వర్యంలో బలపాల సెక్టర్ అంగన్వాడి సెంటర్-1 లో అనారోగ్యంతో సర్వస్తులైన పేడం నరసమ్మ కుటుంబానికి 20వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ముండ్ల ప్రమీల రమేష్, గ్రామ పెద్దలు ఐసిడిఎస్ సిడిపిఓ ఎల్లమ్మ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్లు,ఆయాలు, సిపిఐ పార్టీ గ్రామ కార్యదర్శి రామగాని రవి, గ్రామ పెద్దలు తదితరులు నివాళులు అర్పించారు.