అనారోగ్యాన్ని సాకుగా చూపడం సహేతుకం కాదు
పట్టాబి పిటిషన్‌పై ఏసీబీ కోర్టు వ్యాఖ్య
హైదరాబాద్ గనుల గజనీ గాలి బెయిల్ వ్యవహారంలో భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై అరెస్టయిన పట్టాభిరామారావు దాఖలు చేసుకున్న ప్రత్యేక ఖైదీ పిటిషన్‌ను ఏసిబీ కోర్టు కొట్టివేసింది.ప్రత్యేక ఖైదీకిఆ అనారోగ్యాన్ని సాకుగా చూపడం సహేతుకంగా లేదని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు జైల్లో ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలని ఏసిబీ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది.న్యాయమూర్తులు స్వార్థరహితంగా సాదారణ జీవితాన్ని గడపాలని ఏసీబీ కోర్టు సూచించింది.అక్రమంగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించుకోవాలనుకోవడం పొరపాటని వ్యాఖ్యనించింది.సమాజానికి మార్గదర్శిగా ఉండాల్సిన న్యాయమూర్తి అక్రమాలకు పాల్పడటం దురదృష్టకరమని పేర్కొంది.భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్న ఆరోపణల్లో అరెస్టై జైల్లోనూ ప్రత్యేక సౌకర్యాలు కోరడం భావ్యం కాదని వెల్లడించింది. పట్టాబి ఎలాంటి నేరానికి పాల్పడనట్టయితే నిర్ధోషిత్వాన్ని నిరూపించుకొని కడిగిన ముత్యంలా బయటకి రావాలని అలా బయటకు రావడం కోసం కష్టాలు ఎదుర్కొవడంలో తప్పులేదని కోర్టు వ్యాఖ్యానించింది.పురాణ పురుషులు శ్రీరాముడు .సత్యహరిశ్చంద్రుడు.ధర్మరాజు.నలచక్రవర్తి.జాతిపిత మహాత్మాగాంధీ కూడా కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపింది.పట్టాభి జడ్జీగా ఉన్న సమయంలో తన ఆదేశాల ద్వారా చాలా మంది నిందితులను జైలుకు పంపారని…దురదృష్టం కొద్ది ఆయన అదే జైల్లో ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది.పట్టాభి ఎదుర్కొంటున్న అభియోగం చాలా తీవ్రమైందని.జిల్లా జడ్జి హోదాలో ప్రత్యేక సౌకర్యాలు పొందిన పట్టాభి ప్రస్తుతం జైల్లో వసతులు కల్పించాలని కోరడం ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపుతుందని వ్యాఖ్యానించింది.సాధ్యమైనంత వరకూ పట్టాబీ గౌరవంగా చూసుకోవాలని పేర్కొంది.పట్టాబి దాఖలు చేసిన ప్రత్యేక తరగతి ఖైదీ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.