అనిత కుటుంబానికి లారెన్స్ ఆర్థిక సాయం
హైదరాబాద్,సెప్టెంబర్9(జనంసాక్షిఎ)నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ మరోసారి తన సేవా గుణాన్ని చాటాడు. కష్టాలలో ఉండేవారికి ఎప్పుడు అండగా నిలిచే లారెన్స్ ఆ మధ్య జల్లికట్టు వివాదంలో తన వంతు మద్దతు అందించాడు. చెన్నైలో వచ్చిన వరదలకి నిరాశ్రయిలయిన వారికి కూడా ఎంతో సాయం చేశాడు. ఇక రీసెంట్‌గా ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్ధి అనిత కుటుంబానికి లారెన్స్ 15 లక్షలు సాయం చేసాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కుజుమూర్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల అనిత రీసెంట్ గా తనకి నీట్ పరీక్ష వలన ఎంబీబీఎస్ సీటు రాలేదన్న ఉద్దేశంతో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. పలువురు ప్రముఖులు అనితకి ఆత్మకి శాంతి కలగాలని కోరగా , లారెన్స్ మాత్రం వారి కుటుంబానికి తనవంతు సాయమందించి మరో సారి అందరి మనసులు గెలుచుకున్నాడు. లారెన్స్ ప్రస్తుతం కాంచన 3 చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే ప్రబుత్వం 7లక్షల సాయం అందించగా ఆ కుటుంబం తిరస్కరించింది.