అనుమానాస్పంద స్థితిలో యువకుడు మాలోత్ సునీల్ మృతి

కురివి అక్టోబర్- 9 (జనం సాక్షి న్యూస్)

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామ శివారు  లింగ్య తండా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాదులో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న సునీల్ అనే వ్యక్తి విజయదశమి పండుగ సందర్భంగా తన సొంత గ్రామానికి వచ్చాడు.ఇదే క్రమంలో ఆ తండాలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు.ఆ పోటీల్లో సునీల్ కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు.అయితే, సునీల్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. శనివారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుండగా కాంగ్రెస్ పార్టీ గద్దె పైన కరెంట్ షాక్ తో మరణించడం జరిగిందని పలువురు చెబుతుండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే,మృతుడి ఒంటి గాయాలు ఉండడంతో మృతుడి స్నేహితులను కురివి ఎస్సై-2 మధుబాబు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఇది రాజకీయం,స్నేహితుల హత్యా లేక కరెంట్ షాక్ తో మరణించాడా అనే కోణంలో పోలీసులు వారిని విచారిస్తున్నారు. మహబూబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం లింగయ్య తండాలో అంతక్రియలు నిర్వహించారు. పోస్టుమార్టం,విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని కురవి సెకండ్ ఎస్ఐ మధుబాబు తెలిపారు. డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ బాధ్యులు మాలోతు నెహ్రూ నాయక్ మాట్లాడుతూ సునీల్ మృతికి కారణమైన నిందితున్ని చట్ట రిత్యంగా కఠినంగా శిక్షించి,సునీల్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జండా గద్దె కూల్చే ప్రయత్నంలో ఇతర పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని కూడా పూర్తిగా విచారించాలని కురవి పోలీసు వారిని తెలిపారు.

తాజావార్తలు