అనుమానాస్పద స్థితిలోబాలుడు మృతి
హైదరాబాద్ : నగరంలోని కూకట్‌పల్లి వేంకటేశ్వర నగర్‌లో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. బాలుడు రక్తపుమడుగులో పడి ఉండడంతో పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాలుడిని బంబరాయితో మోది హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేరో చోట బాలుడిని చంపి ఈ ప్రాంతంలో పడేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడు ఎవరన్నదానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా పూటేజీని పరిశీలిస్తున్నారు.