అనుసూచిత్ జాతికి రిజర్వేషన్లు కల్పించాలి
ఖమ్మం, నవంబర్ 6 : అనుసూచిత్ జాతికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు వర్తింప చేయాలని ఆ జాతి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చదలవాడ కృపాకుమార్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు పరచకుండా మన్యం పేరుతో దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్న తొమ్మిది అంశాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనుసూచిత జాతికి రిజర్వేషన్లు వర్తింప చేయని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ఆ జాతి రాష్ట్ర కార్యదర్శి చదలవాడ కృపాకుమార్ హెచ్చరించారు.