అన్నదాతకు అండగా బీమా సౌకర్యం
సిద్దిపేట,ఆగస్ట్16(జనం సాక్షి): టీఆర్‌ఎస్ సర్కార్ అన్నదాతకు అండగా నిలుస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. రైతుబంధు బీమా బాండ్ల పంపిణీ ఓ యజ్ఞంలా సాగుతోందని అన్నారు.రైతులకు పంట పెట్టుబడుల కోసం సీజన్‌కు ఎకరాకు రూ.4వేల చొప్పున అందించే సర్కారు దేశంలో మరే రాష్ట్రం లేదన్నారు. రైతుల రక్షణకు భద్రతను కల్పిస్తూ రూ.5 లక్షల బీమాను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ రైతులు, అన్ని వర్గాల ప్రభుత్వమన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తూ గ్రామాల్లోని ప్రతి మనిషికి కంటి పరీక్షలు నిర్వహించి సమస్యలు ఉన్న వారికి కంటి అద్దాలను సైతం ప్రభుత్వమే ఇస్తుందన్నారు. ప్రతి రోజూ 70 ఇండ్ల చొప్పున 300 మందికి చికిత్సలు నిర్వహిస్తారని అన్నారు. ముందుగానే గ్రామస్తులకు సమాచారం అందించి ఎంపిక చేసిన స్థలాల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.దీని కోసం ప్రత్యేక వైద్యబృందాలను నియమించినట్లు ఆయన తెలిపారు.



