అన్నదాతలు మీరు.. ఆత్మహత్యలొద్దు

5

– మీకండగా మేమున్నాం

– రైతు రక్షణ సమితి

గోషామహల్‌/ చేర్యాల అక్టోబర్‌3(జనంసాక్షి):   ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధార పడ కుండా ప్రజలు పోరాటాల ద్వారా తమ హక్కులను సాధించుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతల కు అండగా మేమున్నామని భరోసా కల్పిం చి వారిలో మనోనిబ్బరాన్ని నింపాలన్న లక్షంతో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అసెంబ్లీ ఎదురుగా గల అమరవీరుల స్మారకస్థూపం గన్‌పార్కు నుండి వరంగల్‌ చేర్యాల వరకు తలపెట్టిన రైతు రక్షణ యాత్రను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన టిజెఎసి ఛైర్మన్‌ ఫ్రొఫెసర్‌ కోదండ రామ్‌, ఇతర నేతలతో కలిసి అమరవీరుల స్మారక స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతనం చుక్కారామయ్య మాట్లాడుతూ రైతు ఆత్మ హత్యలపై ప్రభుత్వంతో పాటు పౌర సమా జం కూడా బాధ్యత వహించాలని అన్నారు. రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై 15నెలలు గడిచినా ఈ సమస్యలకు పరిష్కారాన్ని కనిపెట్టడంలో విఫలమైందని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చురకలు వేశారు. బలవన్మారణాలతో సమ స్యల పరిష్కారం కావని, పోరాటాలతో సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ విద్యావంతుల వేదిక విభిన్న పంథాలో ముందుకు సాగు తుంద ని, సమస్య ఎక్కడ ఉందో అక్కడికే వెళ్లడం తెలంగాణ విద్యావంతుల వేదిక అలవాటు చేసుకుందన్నారు. ఈ యాత్రతో సమస్య పరిష్కారమవుతుందో లేదో తెలియదు కానీ సమస్య పరిష్కారానికి అవసరమైన మనో నిబ్బరాన్ని పెంచేందుకు దోహద పడుతుం దన్నారు. టిజెఎసి ఛైర్మన్‌ ఫ్రొఫెసర్‌ కోదండ రామ్‌ మాట్లాడుతూ తెలంగాణలో గత 25 ఏళ్లుగా సరళీకరణ విధానాలు, ఉమ్మడి ప్రభుత్వ నిర్లక్షం వల్ల దేశానికి అన్నం పెట్టే రైతన్నలు సమస్యల ఊబిలో చిక్కుకున్నా రని అన్నారు. అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నలకు మేమంతా విూకు అండగా ఉన్నామన్న భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలకు గల మూలాలను గుర్తించి, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసు కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని, ప్రభుత్వం వాటిని గుర్తించి రైతుల ఆత్మహత్యలను నివారించాలని కోరారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులకు మేమున్నామని భరోసా కల్పిం చేందుకు తెలంగాణ విద్యావంతుల వేదిక చేపట్టిన రైతు రక్షణ యాత్ర సఫలం కావాలని, మృత్యు ఘంటికలు ఆగి పోవాలని ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో తెలంగాణ రచుయితల వేదిక అధ్యక్షులు మల్లేపల్లి లక్ష్మయ్య, తలెంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి నారాయణ, రైతు కిసాన్‌ సంఘ్‌ అధ్యక్షులు రాంరెడ్డి, తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షులు కత్తి వెంకటస్వామి, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్య క్షులు గురిజాల రవీందర్‌రావు, ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్యలతో పాటు వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు.

రైతు ఆత్మహత్యలు సమాజానికి అరిష్టం : కోదండరాం

చేర్యాల మండలంలోని ఐనాపూర్‌, చేర్యాల లో శుక్రవారం తెలంగాణ విద్యావంతుల రైతు రక్షణయాత్ర సభలు సర్పంచ్‌లు విజ యేందర్‌, అరుణలు అధ్యక్షత వహించగా తెలంగాణ జెఎసి నాయకులు కోదండరాం, మాజీ ఎంఎల్‌సి చుక్కరామయ్య, ఫ్రొఫెసర్లు హరగోపాల్‌, రమా మాల్కోటీలు హాజరై మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసు కోవడం వల్ల భార్య, పిల్లలు అనాథలుగా మారుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం గురించి ఏ రకంగానైతే పోరాడి సాధించుకున్నామో అదే రకంగా రైతు సంఘాలు ఏర్పాటు చేసుకొని రైతు పండించిన ధాన్యానికి రైతు చెప్పిన రేటు ప్రకారం ప్రభుత్వం తీసుకున్నట్లయితే ఆ రోజు నుండే రైతులకు మంచి రోజులు వచ్చనట్లని పేర్కొన్నారు.