అన్నదాత జీవితాల్లో వెలుగు నింపిన ఘనత సీఎం కేసిఆర్ దే.
సభలో అన్నదాతల గురించి మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు రైతును ఆర్థికంగా పరిపుష్టం చెయ్యడమే సీఎం కేసీఆర్ సంకల్పం.
తెలంగాణ వచ్చిన తరువాత రైతాంగం కష్టాలు తీరిపోయాయి.
రైతులను సంఘటితం చేసేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగపడతాయి.
హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి సెప్టెంబర్21:-
భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగపూర్,కోతులనడుమ గ్రామాల్లో కావేరి సీడ్స్ అధినేత భాస్కర్ రావు తన స్వంత ఖర్చులతో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మరియు హుస్నాబాద్ శాసన సభ్యులు శ్రీ.వొడితల సతీష్ కుమార్ గారు, కావేరి సీడ్స్ అధినేత భాస్కర్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతును ఆర్థికంగా పరిపుష్టం చెయ్యడమే సీఎం కేసీఆర్ సంకల్పమని, అందుకే రైతు సంక్షేమం కోసం ఆయన అనేక పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు.
అన్నదాతలను ఆదుకునేందుకే రైతుల రుణ మాఫీ, రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశ పెట్టి ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసి ఆర్థికంగా బలపడాలని సూచించారు. రైతులందరూ ఒకచోట చేరి సాగు విధానాలపై చర్చించుకోవడానికి వీలుగా ‘రైతు వేదిక’లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. దీంతో రైతు శిక్షణ కార్యక్రమాలను చెట్ల కింద, పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించే కష్టాలు తప్పనున్నాయని వెల్లడించారు. రైతు వేదిక కార్యక్రమం ద్వారా క్లస్టర్ లోని రైతులందరికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి చిత్తశుద్దితో వచ్చిన సాగునీళ్లతో అత్యధిక వరి ధాన్యం పండించి తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా నిలిచింది.
రైతులను సంఘటితం చేయడం, వ్యవసాయ మెలుకువలు, మార్కెటింగ్ అంశాలు తెలపడానికే రైతువేదికలు రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకే ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసి మరింత చేయూతనిస్తోంది.
రైతులకు పుష్కలంగా నీళ్లు, రైతుబంధు సాయం, గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతుంది.
తెలంగాణ రాష్ట్రం లో సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర సంస్కరణలు వ్యవసాయానికి ఊతమిచ్చాయి.
రైతులందరినీ ఒకేచోటకు చేర్చి సాగుపై చర్చించుకొనే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించారు.