అన్నదాత వరి గోస… ప్రారంభం కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు.
యాలాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమయ్య
యాలాల నవంబర్ 19(జనంసాక్షి)ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్మకం సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనడానికి ముందుకు రాకపోవడంతో అన్నదాతలు హరిగోస పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని
యాలాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమయ్య విమర్శించారు.ఒకవైపు పాలక ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం, మరో వైపు వరి కోతల సమయంలో అకాల వర్షాలు సంభవించి రైతులకు అపారమైన నష్టం వాటిల్లుతుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో సుమారు వేల ఎకరాలలో
రైతులు వరి సాగు చేసారు. రైతు కళ్లాల్లో ఉన్న వరి ధాన్యం నింపెందుకు సంచులు లేక, కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక పోవడంతో
రైతులు నానా అవస్థలు పడుతున్నారు. నేటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం
ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇప్పటికే లక్షల్లో పెట్టుబడులు పెట్టి వరి పంట పండించుకొని పంటలు అమ్ముకోవడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక, కొనే నాథుడే లేకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా పాలకులు ప్రభుత్వాలు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మండల రైతాంగం తరపున యాలాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమయ్య , సీనియర్ నాయకులు నాగేష్, దేవనూర్ ఖాసీం విజ్ఞప్తి చేసారు.