అన్నా దీక్షకు మద్దతుగా విజయవాడలో సంఘీభావం
విజయవాడ: కేంద్రంలో చోటు చేసుకున్న 15 కుంభకోణాలపై ప్రత్యేక పరిశోధనా బృందంతో విచారణ జరిపించాలని తదితర డిమాండ్లతో ప్రముఖ సంఘ సంస్కరత అన్నా హజారే సభ్యుల బృందంలోని అరవిద్ కేజ్రీవాల్, మనీష్ శిశోడియా, గోపాల్‌రాయ్ తదితరులు న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌వద్ద బుధవారం నుంచి ప్రారంభించిన నిరాహారదీక్షలకు మద్దతుగా పౌరసమాజ వేదిక ఆధ్వర్యంలో విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట సంఘీభావ సమావేశాన్ని నిర్వహించారు. మాజీ సైనికోద్యోగుల సంఘం,యూత్ ఫర్ బెటర్‌ఇండియా, జిల్లా ఆర్చరీ, సంఘం, అవినీతి వ్యతిరేక యువత, లయన్స్ రక్తదాన విభాగం, న్యాయవాదుల సంఘం, రామనామ సంకీర్తన సంఘం, పిరమిడ్ ధ్యానకేంద్రం, వాకర్స్ అసోసియేషన్, భారత స్వాభిమాన్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.