అన్నా వెంకన్నా..నేను తిట్టింది తమ్ముడినే

రాజఘోపాలరెడ్డి వెన్నుపోటు పొడిచాడన్నది నిజమే కదా
నువు మా పెద్దన్నవు..అపోహలతో మనసు పాడుచేసుకోవద్దు
నీకూ నాకూ మధ్య అగాధం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు
విూడియాతో వివరణ ఇచ్చుకున్న పిసిసి చీఫ్‌ రేవంత్‌
రాజగోపాల్‌లో బహిరంగ చర్చకు సిద్దమని సవాల్‌
న్యూఢల్లీి,ఆగస్ట్‌5(జ‌నంసాక్షి): కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీ ద్రోహి అని, వ్యాపారాల కోసమే కాంగ్రెస్‌ పార్టీ మారాడని టీ.పీసీసీ చీఫ్‌ రెవంత్‌ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీతోనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ లేకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బ్రాందీ షాప్‌లో కూడా పని చేయడానికి పనికిరాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు కేవలం రాజగోపాల్‌రెడ్డిపైనే తప్ప మరోటి కాదన్నారు. తాను ఎప్పుడూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడలేదన్నారు. తాను కేవలం రాజగోపాల్‌ రెడ్డి గురించి మాత్రమే మాట్లాడానని చెప్పారు. రాజగోపాల్‌ రెడ్డి విసిరిన బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. చండూరు చౌరస్తాలో నిర్వహించే బహిరంగ చర్చకు తాను హాజరవు తున్నానని, చర్చకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గత ఎనిమిది సంవత్సరాల్లో కేసీఆర్‌ ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పోరాడలేదన్నారు. తనవిూద రాష్ట్ర ప్రభుత్వం 80కి పైగా కేసులు పెట్టిందని తెలిపారు. రాజగోపాల్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసి ఉంటే ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారాడని ఆరోపించారు. విూరు వెన్నుపోటు పొడుస్తున్నారని కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కుటుంబసభ్యుడని.. తాను రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. తనకు, వెంకట్‌రెడ్డికి మధ్య కొందరు అగాధం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. అపోహలతో వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదని రేవంత్‌ అన్నారు. రాజగోపాల్‌రెడ్డిని సొంత పార్టీని ముంచేందుకు యత్నించిన ద్రోహిగా అభివర్ణించిన రేవంత్‌రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎప్పటికీ తమ నాయకుడేనని స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన పోరాటాలు, కాంట్రాక్టుల గురించి తేల్చేందుకే చండూరుకు వస్తున్నామన్న రేవంత్‌….. నిజాయితీపరుడైతే తమతో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ’కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వేరు.. రాజగోపాల్‌రెడ్డి వేరు. రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీకి ద్రోహం చేశాడు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మా కుటుంబసభ్యుడు. నా కంటే సీనియర్‌ నేత.. తెలంగాణ ఉద్యమంలో ఆయనది కీలక పాత్ర. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ ద్రోహి. నా వ్యాఖ్యలకు వెంకట్‌రెడ్డికి ఎలాంటి సంబంధంలేదు. రాజగోపాల్‌రెడ్డిని మాత్రమే విూరు అని సంభోదించాను. నాకు, వెంకట్‌రెడ్డికి మధ్య కొందరు అగాధం సృష్టిస్తున్నారు. అపోహలతో మా వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరంలేదు. రాజగోపాల్‌రెడ్డి సవాళ్లకు ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం. టెండర్లు, కేసీఆర్‌పై పోరాటంపై చండూరుకు వచ్చి మాట్లాడుతా.’ అని రాజ్‌గోపాల్‌ రెడ్డికి ఆయన సవాల్‌ విసిరారు. బీజేపీ పార్టీ కాంట్రాక్టులు ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. భద్రాచలం ముంపునకు ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గమే కారణమని ఆరోపించారు. తెలంగాణకు కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన ఎన్నో ప్రాజెక్టులను
కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని చెప్పారు. తెలంగాణకు బీజేపీ ద్రోహం చేసిందన్నారు. బీజేపీ పార్టీ చాలామంది నేతలకు కాంట్రాక్టులు, కవిూషన్లు ఆశచూపి ప్రలోభాలు పెడుతోందని ఆరోపించారు. చెరుకు సుధాకర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం వల్ల తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరంతరం పోరాడుతుందన్నారు. కాంగ్రెస్‌ మునుగోడు సభలో చెరుకు సుధాకర్‌ పాల్గొంటారని చెప్పారు. కాంగ్రెస్‌ తీసుకునే నిర్ణయాలను తెలంగాణ ప్రజలు కూడా స్వాగతించాలని కోరారు. సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ కోసం కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి బలంగా పని చేస్తున్నారని చెప్పారు. తాను పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేసే వారికి లీగల్‌ నోటీసులు ఇస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. కోమటిరెడ్డి బ్రాండ్‌ లేదనడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో 35 ఏళ్లుగా పని చేస్తున్నానని, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని వెంకట్‌రెడ్డి తెలిపారు. తాను నాలుగు పార్టీలు మారి రాలేదన్నారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇంతకుముందే కోరానని చెప్పారు. సోనియా గాంధీ తనను పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారని తెలిపారు. ఈ విషయంపైనే తాజాగా రేవంత్‌ స్పందించారు.