అన్ని అత్యవసర సర్వీసులకు 112

పోలీసులకు ఫోన్ చేయాలంటే 100.. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయాలంటే 101.. అంబులెన్స్ కోసం ఫోన్ చేయాలంటే 102 ఇలా ఏ అత్యవసర సర్వీసు కోసమైనా వేర్వేరు నంబర్లకు ఫోన్ చేయాల్సిందే! అయితే ఈ సేవలన్నింటికీ ఒకే నంబర్ ఉంటే? ఇదే ఆలోచన వచ్చింది ట్రాయ్కి. అమెరికా తరహాలో దేశంలో అన్ని అత్యవసర సర్వీసుల కోసం ఒకే ఒక్క నంబర్ ను 112ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచించినట్లు ట్రాయ్ ప్రకటించింది. ఒత్తిడిలో ఉన్నవారు ఫోన్ చేస్తే సమాధానం చెప్పేందుకు పబ్లిక్ సేఫ్టీ ఆన్సరింగ్ పాయింట్స్ ను ఏర్పాటు చేయాలని ట్రాయ్ ప్రభుత్వానికి సూచించింది.