అన్ని జాగ్రత్తలు తీసుకోండి
కడప, జూలై 31 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్ మంగళవారంనాడు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆయన అధికారులకు తెలిపారు. సాంస్కృతిలో పాల్గొనే విద్యార్థులకు ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అన్ని శాఖల నుంచి ఉత్తమ సేవలను అందించిన ఇరువురి ఉద్యోగుల పేర్లను 10వ తేదీలోగా పంపాలని చెప్పారు. అలాగే వివిధ శాఖలకు సంబంధించిన యూనిట్ల పంపిణీకి తగు ఏర్పాట్లు చేయలని అధికారులకు స్పష్టం చేశారు.