అన్ని దానాలలో కేల్ల అన్నదానం మహా గొప్పదానం.
అన్నం పరబ్రహ్మ స్వరూపం.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు అక్టోబర్ 9(జనంసాక్షి)దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ రేణుక నాగ ఎల్లమ్మ భవానీ మాత సేవాసమితి తాండూర్ వారు సోలాపూర్ నుండి తుల్జాపూర్ వెళ్లే దారిలో తామల్వాడి గ్రామం , మహారాష్ట్ర వద్ద నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్ల అన్నదానం మహ గొప్పదని అన్నారు. తాండూర్ లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారని అన్నారు. వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉండాలని తుల్జాపూర్ భవాని మాతను వేడుకుంటున్నానని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు మంచి విద్యను అందించాలని అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా తాండూరు ప్రజలపై ఉండాలని వేడుకుంటున్నానని చెప్పారు. శ్రీ రేణుక నాగ ఎల్లమ్మ భవాని మాత సేవాసమితి తాండూర్ వారిని అభినందించారు. సోలాపూర్ నుండి తుల్జాపూర్ వరకు అమ్మవారి దర్శనానికి పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులు ఈ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ,అన్న ప్రసాదం పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, తాండూర్ మండల పార్టీ అధ్యక్షుడు రాందాస్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, నర్సిరెడ్డి (రాజు అన్న), శ్రీనివాస్ చారి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, దేవస్థాన కమిటీ చైర్మన్లు బంటారం సుధాకర్, రాజన్ గౌడ్, ఎంపిటిసి ప్రవీణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.