అన్ని దేశాల్లోనూ ధనవంతుల వలసలు

న్యూఢిల్లీ,మార్చి31(జ‌నంసాక్షి): ధనవంతుల వలసలో భారత స్థానంలో ఉంది. ఇదే ధనవంతుల వలసలో ఫ్రాన్స్‌లో అత్యధికంగా 10 వేల వరకు ఉంది. 2015లో దేశం నుంచి 4 వేల మంది ధనవంతులు ఇతర దేశాలకు వలసపోయారు. నూతన ఆర్థిక సంపద అధ్యయనం ప్రకారం.. 4 వేల మంది భారతీయ ధనవంతులు తమ స్థిర నివాసాన్ని మార్చుకున్నారు. కాగా చైనా నుంచి 9 వేలు, ఇటలీ నుంచి 6 వేలు, భారత్‌ నుంచి 4 వేల మంది 2015లో వలసపోయి ఇతర దేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. చైనా, భారత్‌ల నుంచి వలసలు ఆందోళన కలిగించేవిగా లేవని సర్వే పేర్కొంది. ఎందుకంటే వలసపోయే ధనవంతుల కంటే ఎక్కువగా నూతన మిలియనీర్లు తయారౌతుండటమే ఇందుకు కారణం. జీవన పరిస్థితులు ఈ దేశాల్లో ఒక్కసారిగా మెరుగుపడితే వలసపోయిన ధనవంతులంతా తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించింది. క్రిస్టియన్లు, ముస్లీంల మధ్య మతపరమైన ఆందోళన నేపథ్యంలో ఫ్రాన్స్‌లో వలసలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అదేవిధంగా మత ఉద్రిక్తతలతో అశాంతి నెలకొన్న యూరోపియన్‌ దేశాలైన బెల్జియం, జర్మనీ, స్వీడన్‌, యూకేలు సవిూప కాలంలోనే ధనవంతుల వలసలతో ప్రభావం కానున్నాయి. వ్యక్తిగతంగా ఒక మిలియన్‌ డాలర్ల నికర సంపద కలిగిన వారిని మిలీయనీర్లుగా సర్వే పేర్కొంది.