అన్ని వర్గాలకు విద్య వైద్యం ఆరోగ్యం అందించడమే లక్ష్యం

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):విద్య , వైద్యం , ఆరోగ్యం అన్ని వర్గాలకు అందించడమే లక్ష్యంగా జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం పని చేస్తున్నదని ఆ సంఘం చైర్మన్ మంగళంపల్లి హుస్సేన్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో జరిగిన జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.సమాజంలో రోజురోజుకు మహిళలు , మైనర్ బాలికల పైన దాడులు పెరుగుతున్నాయని,అలాంటి వారికి రక్షణగా తమ సంఘం ఉంటుందని అన్నారు.ధరణి పోర్టల్ లో నెలకొన్న సమస్యల పరిష్కారం,వినియోగదారుల హక్కుల పరిరక్షణ , వరకట్న వేధింపులు లాంటి అన్ని సమస్యలపై తమ సంఘం పోరాడుతుందని తెలిపారు.సామాజిక సేవ, సామాజిక న్యాయం,సామాజిక మార్పు లక్ష్యంగా తమ సంఘం పని చేస్తుందన్నారు.ఈ సమావేశంలో నూతనంగా జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పి.సైదులు, అన్నేపర్తి శ్యామ్, కారింగుల శ్రీనివాస్, శ్రీరామ్ నవీన్, సురేష్, నరేష్, రవి, గోపి, శ్రీను, భూపాల్ రెడ్డి, నాగభూషణం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area