అఫ్ఘాన్ తొలి విజయం నమోదు
స్కాట్‌లాండ్‌పై ఉత్కంఠ పోరు
న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి): ప్రపంచకప్‌లో భాగంగా డునెడిన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో అప్ఘనిస్థాన్ ఘనవిజయం సాధించింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అప్ఘనిస్థాన్ ఒక వికెట్ తేడాతో గెలిచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకున్న స్కాట్లాండ్ 50 ఓవర్లలో 210 పరుగులకు చేసి ఆలౌటైంది. అప్ఘనిస్థాన్ లక్ష్య ఛేదనను చేరుకునేందుకు చివరి వరకూ పోరాడి తొమ్మిది వికెట్ల నష్టానికి 211 పరుగులను చేసి తీవ్ర ఉత్కంఠ మధ్య ఎట్టకేలకు విజయాన్ని కైవసం చేసుకుంది.
ప్రపంచకప్‌లో భాగంగా డునెడిన్ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఎ/-గానిస్థాన్ వికెట్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య లద్కదనలో అఎ/-గానిస్థాన్ తడబడినా చివర్లో ధాటిగా ఆడి మరో మూడు బంతులు మిగిలి ఉండగానే తొమ్మిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని లద్కదించింది.
షెన్వారీ వీరోచిత పోరాటం
97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన అప్ఘనిస్థాన్ ను షెన్వారీ అద్భుతమైన పోరాట పటిమతో ఆదుకున్నాడు. సహచరుల నుంచి ఎలాంటి సహకారం అందకపోయినా…షెన్వారీ ధాటిగా ఆడుతూ 147 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్ అహ్మది (51) అర్ధశతకంతో రాణించాడు.మ్యాచ్ చివర్లో పరుగులు, బంతులు సమానం కావడంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ.. అప్ఘనిస్థాన్ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా మూడు బంతులు మిగిలి ఉండగానే విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. స్కాట్లాండ్ బౌలర్లలో బారింగ్టన్ 4, ఇవాన్స్ 2, డేవి 2, హక్ ఒక వికెట్ తీశారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అప్ఘనిస్థాన్ కెప్టెన్ మహ్మద్ నబి నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు నిలకడగా బౌలింగ్ చేస్తూ వరుసగా వికెట్లు తీశారు. అప్ఘనిస్థాన్ బౌలర్ల జోరుతో స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్లు కనీసం ఒకరు కూడా 40 పరుగుల స్కోరు చేయలేకపోయారు. హక్(31),బారింగ్టన్(25), కొయిట్టర్(25) ఫర్వాలేదనిపించారు. అఎ/-గాన్ బౌలర్లలోషాపూర్ జర్దాన్ 4, దావల్ట్ జర్దాన్ 3, హసన్ 1, మహ్మద్ నబి, గుల్బదిన్ నబి చెరో వికెట్ తీశారు.