అబద్దాలతో సిఎం కాలక్షేపం

హావిూలు అమలు చేయనందుకు నమ్మాలి: జవహర్‌

అమరావతి,జూలై16(జనం సాక్షి ): తనను ఎందుకు నమ్మాలో సీఎం జగనే చెప్పాలని మాజీ మంత్రి జవహర్‌ పేర్కొన్నారు. రైతులను దగా చేసినందుకు నమ్మాలా? అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు విమర్శలతో కాలం గగడుపుతావని అంటూ సీఎం జగన్‌పై జవహర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. పంట రుణాలు సబ్సిడీలో మోసం చేసినందుకు నమ్మాలా? నీ హయాంలో పంట విరామమిచ్చినందుకు నమ్మాలా? ధాన్యం కొనుగోలు డబ్బు ఈ నాటికి ఇవ్వనందుకు నిన్ను నమ్మాలా? విద్యార్థులకు మేనమామ అని వారికి బడులు దూరం చేసినందుకు నమ్మాలా? ఇంట్లో అందరికి అమ్మ ఒడి అని ఇంకో బిడ్డకు మోసం చేసినందుకు నిన్ను నమ్మాలా? దళితులపై దమనకాండ కొనసాగిస్తున్నందుకు నిన్ను నమ్మాలా? దళితుల సంక్షేమ పధకాలు 27 రద్దు చేసినందుకు నిన్ను నమ్మాలా? వెయ్యి అబద్దాలు లక్షల వాగ్దాన భంగం చేస్తున్నందుకు నమ్మాలా? మధ్యపాన నిషేధాన్ని నినాదంగా మార్చి ప్రజలను ఏమార్చినందురు నిన్ను నమ్మాలా? వారంలో రద్దు చేస్తానని సీపీయస్‌ ఉద్యోగులను మోసగించినందుకు నమ్మలా? ఇలా చెప్పుకుంటూ పోతే
అనేకం జగన్‌ గారు నిన్ను నమ్మి పోసపోయినవి ..ఇంక నిన్నెలా నమ్మాలో చెప్పండని జవహర్‌ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జైలు భయంతో రాష్టాన్రికి వెన్నుపోటు పొడుస్తున్నారని, రాష్టాన్రికి రావాల్సిన వాటి పై ఢల్లీిలో నోరెత్తలేకపోతున్నారని టీడీపీ ఎంపీలు విమర్శించారు. ఈ నెల 18న నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా సమస్యలపై నిలదీస్తామని ఎంపి రామ్మోమన్‌ నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించి ఇస్తే వారిని జగన్‌రెడ్డి ఢల్లీిలో తాకట్టుపెట్టి తన కేసుల గురించి మాట్లాడుకొంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధనపై నోరు కూడా ఎత్తడం లేదు. రాష్టాన్రికి కేంద్ర నిధులు తేవడంలో విఫలమయ్యారు. కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానన్న పెద్ద మనిషి ఇప్పుడు మెడ దించుకొని తిరుగుతున్నారని రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం, ఫ్యాక్షన్‌ రాజకీయం పెరిగిపోయాయని, వీటిని పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని చెప్పారు.