అబుదాబి విమానాశ్రయంపై డ్రోన్‌ దాడి


` ఆయిల్‌ ట్యాంకర్లు లక్ష్యంగా దాడులు
` ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు మృతి
అబుదాబీ,జనవరి 17(జనంసాక్షి):యూఏఈ రాజధాని అబుదాభి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టుపై ఉగ్రదాడి జరిగింది. డ్రోన్‌ సహాయంతో టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఎయిర్‌ పోర్టులోని ఇంధన వాహక ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ దాడిలో మూడు ఆయిల్‌ ట్యాంకర్లు పేలిపోవడంతో పాటు ముగ్గురు యువకులు చనిపోయారు. అందులో ఇద్దరు ఇండియన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.పెట్రోల్‌ ట్రక్కులు పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. వాటిని ఆర్పేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు .యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌ సవిూపంలో యెమెన్‌ హౌతీ ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా జరిపిన దాడుల్లో ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు చనిపోయారు. ఆరుగురు గాయపడ్డారు. ఘటనలో మూడు పెట్రోల్‌ ట్యాంకర్లు పేలిపోయాయి. దాడుల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దాడి తమ పనే అని హౌతీ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. మరోవైపు.. ఈ డ్రోన్‌ దాడులకు పాల్పడిరది తామేనని యెమెన్‌ హౌతీ ఉగ్రవాదులు ప్రకటించారు. హౌతీ ఉగ్రవాదులకు ఇరాన్‌ మద్దతు ఉంది. 2019 సెప్టెంబర్‌ లో సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు స్థావరాలపై హౌతీ ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో గల్ఫ్‌ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.