అభివృద్ది కోసం టిఆర్‌ఎస్‌ పాలన ఆవశ్యం

కాంగ్రెస్‌ కూటమితో ఒరిగేదేవిూ లేదు: పోచారం
నిజామాబాద్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): డెబ్బై ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ చేసిన పాపాలను కడుగేయడంతో పాటు అభివృద్ది దిశగా టిఆర్‌ఎస్‌ అడుగులు వేస్తోందని  మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంతటి అభివృద్దిని గతంలో ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కూటమి, బిజెపిలతో ఒరిగేదేవిూ లేదన్నారు. భాజపా, తెదేపా, కాంగ్రెస్‌ల వల్లనే తెలంగాణకు ఈ పరిస్థితి దాపురించిందని మంత్రి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు.  మంత్రికి మహిళలు తిలకం దిద్ది మంగళహారతులతో స్వాగతించి సంప్రదాయంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు గ్రామాలకు కనీసం రహదారి సౌకర్యం కల్పించలేక పోయారన్నారు. తెరాస నాలుగేళ్ల పాలనలో మారుమూల గ్రామాలకు సైతం రహదారి సౌకర్యం కల్పించిందన్నారు. గ్రామాల
ప్రజలు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని, తెరాస పాలనలో వారి కష్టాలు దూరమయ్యా యని చెప్పారు. అధికారంలోకి రావడానికి భాజపా నాయకులు అమలుకు సాధ్యం కానీ హావిూలు ఇస్తున్నారన్నారు. అభివృదద్‌ఇ కొనసాగాలంటే తెరాస మళ్లీ అధికారంలో రావడం అవసరమన్నారు. రైతుల  సంక్షేమ కార్యక్రమాలు, పేదలకు చేపట్టిన కార్యక్రమాలు ముందుకు వెళ్లాలంటే కెసిఆర్‌ సిఎం కావాల్సి ఉందన్నారు. నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని అన్నారు. ఇది నిరంతరం కొనసాగుతోందన్నారు.