అభివృద్ధికి ‘రహదారులు’

4

– మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేకు ప్రధాని శంకుస్థాపన

న్యూఢిల్లీ,జనవరి 1(జనంసాక్షి): దేశంలోని మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి బాటలో పయనించాలంటే చక్కని రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. వేగవంతమైన రవాణా సౌకర్యాల ద్వారా మౌలిక వసతులు సైతం వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామసడక్‌ యోజన కార్యక్రమం ద్వారా మాజీ ప్రధాని వాజ్పేయి రోడ్డు మార్గాల అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ఢిల్లీ-విూరట్‌ ఎక్స్ప్రెస్‌ వే రహదారికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శంకుస్థాపన చేశారు. 14 లేన్లతో నిర్మించనున్న ఈ రహదారిని అభివృద్ధికి రాజమార్గంగా ప్రధాని పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేలా ఆధునిక పద్ధతిలో ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో విూరట్‌ కీలక పాత్ర పోషించిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొత్త హైవే వల్ల ఢిల్లీ ప్రజలు వీకెండ్‌ ట్రిప్‌ వెళ్లేందుకు సులువు అవుతుందని మోదీ అన్నారు. ఎక్స్‌ప్రెస్‌ వేను ఢిల్లీ ప్రజలకు న్యూ ఇయర్‌ కానుకగా అందిస్తున్నట్లు మోదీ చెప్పారు. నేషనల్‌ హైవే-24 ప్రాజెక్టు కోసం రూ. 10,166 కోట్లు ఖర్చు చేయనున్నారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. కాలుష్య నియంత్రణలోనూ ఎక్స్‌ప్రెస్‌వే తోడ్పడుతుందని ప్రధాని అన్నారు. గ్రావిూణ ప్రాంతాలకు రవాణా సంబంధాలు ఏర్పడితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మోదీ అన్నారు.  ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ-విూరట్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం ఇవాళ శుంకుస్థాపన చేసిన మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సభలను అడ్డుకునే హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. వచ్చే ఏడాది నుంచి పార్లమెంట్‌కు ఎటువంటి ఆటంకాలు ఉండవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ వేదికగా దేశ ప్రజల సమస్యలను చర్చించేందుకు ప్రతిపక్షాలు విముఖంగా ఉన్నాయన్నారు. పార్లమెంట్‌ నిర్వహణను అడ్డుకుని, సభల్లో గందరగోళం సృష్టిస్తున్న విపక్షాలు తమ వైఖరిని మార్చుకోవాలని మోదీ హితువు పలికారు. సభలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన కోరారు. సహేతుకమైన  చర్చలు జరిపి విధానపరమైన మంచి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారని, ఆ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ప్రధాని మోదీ రాజకీయ పార్టీలను కోరారు. ప్రజలు తిరస్కరించిన పార్టీల నేతలు పార్లమెంటును సరిగ్గా పనిచేయనివ్వడం లేదని ఆయన విమర్శించారు. అభివృద్ధితో అనుసంధానం అవ్వాలంటే.. గ్రామాలన్నీ మంచి రహదారులతో ఉండాలని గ్రామస్థులు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు నితిన్‌గడ్కరీ, మహేష్‌ శర్మలు కూడా హాజరయ్యారు. అయితే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ కార్యక్రమానికి గైర్హాజరవ్వడం

ఎక్స్‌ప్రెస్‌ వే ద్వారా విూరట్‌ నుంచి ఢిల్లీ మధ్య 70 కిలోవిూటర్ల దూరం ఉన్నా.. కేవలం 40 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది. అంతకుముందు నోయిడాలో ప్రధానికి గవర్నర్‌ రామ్‌నాయక్‌ స్వాగతం పలికారు.

‘ఎంజాయ్‌ చేశారుగా.. పార్లమెంటును జరగనివ్వండి’

నోయిడా: కొత్త సంవత్సరంలోనైనా పార్లమెంటు వ్యవహారాలు జరగనివ్వాలని భారత ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌ పార్టీ, ఇతర ప్రతిపక్షాలను కోరారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకపోవడం నిజంగా దురదృష్టకరమని చెప్పారు. ఆరు దశాబ్దాలపాటు అధికారాన్ని ఎంజాయ్‌ చేసిన కాంగ్రెస్‌ ఇప్పటికైనా సభలను కొనసాగేందుకు సహకరించాలని కోరారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ఢిల్లీ-విూరట్‌ ఎక్స్‌ప్రెస్‌ వే రహదారికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శంకుస్థాపన చేశారు. 7,500 కోట్ల భారీ

వ్యయంతో 14 లేన్లతో నిర్మించనున్న ఈ రహదారి శంకుస్థాపన సందర్బంగా మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పై విరుచుకుపడ్డారు. ఆరు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని ఎంజాయ్‌ చేసిందని, దేశ అభివృద్ధి విషయంలో తనకు ఏం తెలియనట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని చేతికందిస్తే కాంగ్రెస్‌ బాధ్యతారహితంగా వ్యవహరించి ఆరు దశాబ్దాలు వృధాగా గడిపిందని మండిపడ్డారు. ‘రేపు జనవరి 1. కొత్త సంవత్సర వేడుకలకు వెళ్లే ముందు గట్టిగా ప్రమాణం చేయండి.. మేం పార్లమెంటును సజావుగా జరగనిస్తామని.. దేశ అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని’ అని మోదీ అన్నారు. ‘లోక్‌ సభ ప్రారంభమైనప్పటి నుంచి నాకు సరిగా మాట్లాడే అవకాశమే రావడం లేదు. అందుకే నేను జనసభల్లో మాట్లాడుతున్నాను. ప్రజలు మనల్ని పార్లమెంటుకు పంపించింది చర్చించడానిని.. నిర్ణయాలు తీసుకోవడానికి.. ఎక్కడివక్కడ పెండింగ్‌ లో పెట్టడానికి కాదు.. సభా వ్యవహారాలు నిలిచిపోయేలా చేసేందుకు కాదు’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా మోదీ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. గ్రూప్‌-3, గ్రూప్‌-4 పరీక్షలకు ఇంటర్యూలు నిర్వహించవద్దని, మెరిట్‌ ఆధారంగా వారు ఉద్యోగాలు పొందేలా అవకాశం కల్పించాలని ఆ విజ్ఞప్తిలో

కోరారు.