అభివృద్ధి, అందరి గౌరవం బిజెపి లక్ష్యం
-బస్తీ సంపర్క్ యోజన కరపత్రాలను ఆవిష్కరించిన ఎస్సీ మోర్చా వరంగల్ జిల్లా కమిటీ.
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 15(జనం సాక్షి)
భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయంలో బస్తీ సంపర్క్ యోజన కరపత్రాలను వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నల్లబెల్లి సుదర్శన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా మహంకాళి జిల్లా ఇంచార్జ్ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బన్న ప్రభాకర్ గారు , మాదాసు రాజు
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దళితులను మోసం చేసే వాగ్దానాలు చేస్తూ ఎన్నికలలో గెలిచిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయి దళితులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటుందని ఆరోపించారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలి అన్న కేసీఆర్ మాటలు దళితులను అవమానించడమే అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొప్పు భాషా గారి సూచనల మేరకు బస్తి సంపర్కు అభియాన్ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలో 500 బస్తీలను భారతీయ జనతా పార్టీ మండల, జిల్లా నాయకుల సమన్వయంతో సంపర్కం చేయాలని పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాలలోని మండల, డివిజన్ అధ్యక్షులు మరియు బిజెపి నాయకులు బస్తి సంపర్కు యోజన కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దళితుల కు అండగా ఉండి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శులు చింతం భాస్కర్, గుంటి వీర ప్రకాష్,నలిగంటి నర్సింగ్,జన్ను కుమార్,జీలకర్ర వీరస్వామి,పొలెపాక జనార్ధన్,ములుగురి ఆనందం, మేకల లింగమూర్తి,పోలేపాక శరత్,దండు చక్రపాణి, ప్రవీణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.