అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామసభ….
చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండలంలోని అజ్జమర్రి గౌతాపూర్ గ్రామాలలో గ్రామ సర్పంచుల అధ్యక్షతన గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాల పైన గ్రామ ప్రజలతో కలిసి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది అజ్జమర్రి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో గ్రామానికి సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పంట పొలాలకు సంబంధించిన 6మట్టి రోడ్లను అలాగే ఆయకట్టు పంట పొలాలకు సంబంధించిన కాలువల పూడిక తీయుట కొరకు గ్రామ సభ ద్వారా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అలాగే గౌతాపూర్ గ్రామానికి సంబంధించి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామసభ నిర్వహించి కొందరు దాతల సహకారంతో గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు అలాగే గ్రామంలోని పారిశుద్ధ్య పనులపై గ్రామంలో మద్యపాన నిషేధం ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకుగాను ప్రతి ఒక్కరు సహకరించాలని అలాగే గ్రామంలో మన ఊరు మనబడి ద్వారా మంజూరైన పనులను చేపట్టుడు కొరకై గ్రామ సభ ద్వారా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచులు పరుశురాం రెడ్డి,స్వరూప విట్టల్, గ్రామ కార్యదర్శి ప్రశాంతి ఎంపిటిసి మల్లయ్య నాయకులు మాణిక్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి భీమయ్య పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు