అభివృద్ధి పనుల్లో అందరూ భాగస్వామ్యం కావాలి
– జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి హుజూర్ నగర్ సెప్టెంబర్ 1 (జనం సాక్షి): రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి పనుల్లో అందరూ భాగస్వామ్యం కావాలనీ హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, అమరవరం సర్పంచ్ సుజాతఅంజిరెడ్డి లు అన్నారు. గురువారం
మండలంలోని అమరవరం గ్రామంలో 10 లక్షల రూపాయల సిడిపి నియోజకవర్గ అభివృద్ధి నిధులు, 5 లక్షలు రూపాయల మండల పరిషత్ నిధుల నుండి గ్రామంలో నిర్మిస్తున్న డ్రైనేజ్ నిర్మాణ పనులను జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, సర్పంచ్ గుజ్జుల సుజాత అంజిరెడ్డి, ఎంపీటీసీ వైస్ ఎంపీపీ సింగతల సైదమ్మ ఆదినారాయణ రెడ్డి లు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా శానంపూడి సైదిరెడ్డి గెలిచిన తర్వాత నియోజకవర్గంలో 3500 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అమరవరం గ్రామంలో యాతవాకిళ్ళ రోడ్డులో డ్రైనేజీ లేక ఇండ్లలలో వాడుకున్న నీళ్లు రోడ్డు మీదకు వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందన్నారు. ఈ విషయం ఎమ్మెల్యే సైదిరెడ్డి దృష్టికి తీసుకుపోయిన వెంటనే స్పందించి తన సిడిపి నిధులనుండి పది లక్షల రూపాయలు కేటాయించారన్నారు. ఇప్పటికే గ్రామంలో ఎమ్మెల్యే సహకారంతో సిసి రోడ్స్, డ్రైనేజీలు ఏర్పాటు, ప్రాథమిక పాఠశాలకు అదనపు గదుల నిర్మాణం, లింగమంతుల స్వామి గట్టు, అభివృద్ధి పనులకు పశువుల ఆసుపత్రి నిర్మాణంనకు రెండు కోట్ల రూపాయలు వెచ్చించారన్నారు. గ్రామంలో మిగిలి ఉన్న సిసి రోడ్స్, డ్రైనేజీలు ఏర్పాటుకు ఎమ్మెల్యే శానంపూడి సహకారంతో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వరలక్ష్మీ, లింగారెడ్డి, కోఆప్షన్ సభ్యులు బలుపు నూరి అంతారెడ్డి, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ రెడ్డి, గ్రామ పెద్దలు గుండ్లపల్లి సైదిరెడ్డి, అన్నెం సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.