అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికా ప్రకటనల్లో బహిరంగ పరచాలి

` ఎన్నికల సంఘం
జైపుర్‌(జనంసాక్షి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం సవిూపిస్తోన్న వేళ.. సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది.ఈ క్రమంలో ఈసీ బృందం మూడు రోజులపాటు రాజస్థాన్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం ఓటింగ్‌ను మరింత సులభతరం చేయడంతోపాటు ఓటింగ్‌ శాతాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అదే విధంగా పౌరులు తప్పనిసరిగా ఓటు వేయాలనే విషయంపై తమవద్ద ఎటువంటి ప్రతిపాదన లేదన్నారు.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికా ప్రకటనల్లో బహిరంగ పరచాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)పేర్కొన్నారు. అంతేకాకుండా అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేశారనే కారణాలను రాజకీయ పార్టీలు (ఖనీశ్రీతిబితిఞజీశ్రీ ఖజీతీబితివబ) కూడా వివరించాలన్నారు. తప్పుడు అఫిడవిట్లు, కులాలకు సంబంధించి సోషల్‌ విూడియాలో తప్పుడు ప్రచారాలు, ఎన్నికల తాయిలాలు, ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వృద్ధులతోపాటు 40శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వారు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే సౌలభ్యాన్ని రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కల్పిస్తామన్నారు. తప్పనిసరి ఓటింగ్‌పై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఎన్నికల సంఘం ముందు అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని చెప్పారు.రాజస్థాన్‌లో ఈ ఏడాది చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావాల్సి ఉంది. దీంతో సీఈసీ రాజీవ్‌కుమార్‌తోపాటు మరో ఇద్దరు కమిషనర్లు అనూప్‌ చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌ల బృందం మూడురోజుల పాటు అక్కడ పర్యటించింది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసింది. ఎన్నికల సమయంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం, నగదు సరఫరాపై భద్రతా సిబ్బంది గట్టి నిఘా ఉంచాలని ఎన్నికల సంఘం రాజస్థాన్‌ అధికారులను ఆదేశించింది. ఇదిలాఉంటే, అక్టోబర్‌ 3 నుంచి ఈసీ బృందం తెలంగాణలోనూ పర్యటించనుంది.