అమరజవానులకు ఆర్టీ ఘననివాళి
శ్రీనగర్,నవంబర్15(జనంసాక్షి): శత్రు దేశ సైనికులతో పోరాటంలో వీర మరణం పొందిన అమర జవాన్లకు ఆర్మీ ఘనంగా నివాళులు అర్పించింది. ఆర్మీ ఉన్నతాధికారులు, తోటి సైనికులు వారి పార్థివదేహాలపై పుష్పగుచ్ఛాలుంచి అంజలి ఘటించారు. గత శుక్రవారం పాకిస్థాన్ సైన్యం బరితెగించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. గురెజ్, కెరాన్, యూరీ సెక్టార్లలో భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ రాకేశ్ దోవల్తోపాటు హవల్దార్ హర్దన్ చంద్ర రాయ్, నాయక్ సతాయ్ భూషణ్ రామేశ్రావు, గన్నర్ సుబోధ్ ఘోష్, సిపాయ్ జొందాలే రుషికేశ్ రాంచంద్ర వీర మరణం పొందారు. వీరితోపాటు మరో ఆరుగురు సాధారణ పౌరులు కూడా పాకిస్థాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.