అమరావతియే ఎపి రాజధాని
సిఆర్‌డిఎ చట్టాన్నిరద్దు చేసే అధికారం లేదు
అమరావతి రాజధాని నిర్మాణం సాగించాలి
రాజధాని అసవరాలకే భూముల వినియోగం
మూడు రాజధానుల చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదు
భూములుల ఇచ్చిన వారందరికి మూడు నెల్లలోగా ప్లాట్లు
అభివృద్ది పనులను ఎప్పటికప్పుడు తెలియ చేస్తుండాలి
సిఆర్‌డిఎ చట్టంమేరకే ముందుకు నడవాలి
సంచలన తీర్పు వెలువరించిన ఎపి హైకోర్టు ధర్మాసనం
అమరావతి,మార్చి3(జనం సాక్షి): రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్మించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత ప్రభుత్వం చేసిన సిఆర్‌డిఎ చట్టం ప్రకారం పనిచేయాల్సిందేనని పేర్కొంది. అమరావతి భూములను రాజధానికి తప్ప వేరే అవసరాలకు వినియోగించుకోవద్దని స్పష్టం చేసింది. ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్‌ప్లాన్ అమలు చేయాల్సిందేనని పేర్కొంది. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియజేయాలని తెలిపింది. రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడు నెలల్లోగా అందజేయాలని ఆదేశించింది. ఆరు నెలల్లో ఒప్పందం ప్రకారమే రాజధానిగా అమరావతిని అభివృద్ది చేయాలని తీర్పునిచ్చింది. అలాగే మూడు రాజధానుల చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలేదని కూడా హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. గతంలో యు.సి.ఆర్.డి.ఎతో అమరావతి రైతుల ఒప్పందాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి నిర్మాణం అవుతూ పూర్తికావాల్సిన భవనముల పనులను పూర్తిచేసి ఉద్యోగులకు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులకు అందించాలని పేర్కొంది. రహదారులు, డ్రెయినేజీ, నీటిసరఫరా, మున్నగు పనులను త్వరితగతిన చేపట్టాలని తెలిపింది. రెండు సంవత్సరాలు పైగా ఉద్యమాన్ని ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సజీవంగా నిలబెట్టిన రైతులకు ప్రత్యేకంగా మహిళా సోదరీమణులకు హైకోర్టు అభినందనలు తెలిపింది. మూడు రాజధానులు, సిఆర్‌డిఎ
రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్ట్ కీలక తీర్పు వెల్లడిరచింది. సీఆర్డీఏ చట్ట ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లాలని స్పష్టం చేసింది. రైతులతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని పేర్కొంది. అలాగే అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకి నివేదిక ఇవ్వాలని సూచించింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదికను హైకోర్టు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా వాటికి ఆ భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించొద్దని స్పష్టం చేసింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని ఆదేశించింది. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈరోజు హైకోర్టు తీర్పు అమరావతి రైతులతోపాటు, రాష్ట్ర ప్రజానీకం హర్షిస్తుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి. మధు అన్నారు.